News May 4, 2024
వార్నర్ 70 శాతం ఇండియన్: జేక్ ఫ్రేజర్

టాలీవుడ్, బాలీవుడ్ డైలాగ్‌లకు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసే DC ప్లేయర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు ప్లేయర్ జేక్ ఫ్రేజర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కోసారి అతడిని చూస్తుంటే నాకు భారతీయుడిగానే కనిపిస్తారు. అందుకే వార్నర్ 70 శాతం ఇండియన్, 30 శాతం ఆస్ట్రేలియన్ అని చెబుతా. నేను కలిసిన వ్యక్తుల్లో అతను నిస్వార్థ ప్లేయర్. సాయం చేయడానికి 24/7 అందుబాటులో ఉంటారు’ అని కొనియాడారు.
Similar News
News December 9, 2025
షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.
News December 9, 2025
డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
News December 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


