News March 31, 2024
గేల్ రికార్డు సమం చేసిన వార్నర్

ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించారు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన అర్ధ సెంచరీ బాదారు. దీంతో కలుపుకుని ఆయన ఇప్పటివరకు 110 ఫిఫ్టీలు సాధించారు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకవీరుడు క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశారు. కాగా వార్నర్ ఐపీఎల్‌లో 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన ఖాతాలో 4 శతకాలు కూడా ఉన్నాయి.
Similar News
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT
News April 18, 2026
రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.
News April 18, 2026
ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి వల్ల స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడమే కాకుండా వాటి పనితీరూ నెమ్మదిస్తోంది. ఓవర్ హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలొస్తుంటాయి. వీటిని నివారించేందుకు ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


