News March 23, 2025

ఎయిర్ ఇండియాపై వార్నర్ ఆగ్రహం

image

విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం గంటకు పైగా ఆలస్యం కావడంతో ఆయన సంస్థపై మండిపడ్డారు. పైలట్ల కొరతతో ఫ్లైట్ ఆలస్యమవుతుందని తెలిసినా ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. కాగా ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రమోషన్ల కోసం వార్నర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News October 24, 2025

భారత్ బంద్.. యథావిధిగా స్కూళ్లు

image

భారీ వర్షాలకు ఇవాళ ప.గో., ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకూ భారీ వర్షాలున్న నేపథ్యంలో తమకూ సెలవివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఇవాళ భారత్ బంద్ కూడా కావడంతో స్కూళ్లకు సెలవు ఉంటుందని కొందరు భావించారు. కానీ, బంద్ ప్రభావం లేకపోవడంతో ఏపీ, టీజీలో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. మీ ప్రాంతంలో సెలవుందా? COMMENT.

News October 24, 2025

విశాఖ డేటా సెంటర్‌: TDP, YCP మధ్య ‘క్రెడిట్’ వార్!

image

AP: విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్‌పై TDP, YCP మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. క్రెడిట్ తమదేనని రెండు పార్టీలు వాదిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌కు తమ హయాంలోనే ఒప్పందం జరిగిందని చెప్తున్నాయి. 2020 నవంబర్‌లో అగ్రిమెంట్, 2023 మేలో శంకుస్థాపన చేశామని మాజీ సీఎం జగన్ చెప్పడంపై TDP మండిపడింది. 2019లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడే అదానీ గ్రూప్, AP ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. దీనిపై మీ కామెంట్?

News October 24, 2025

APSRTCలో 277 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

APSRTC‌లో 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.118. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/