News September 11, 2024

WARNING.. ఇలాంటి కాల్స్‌తో జాగ్రత్త: సజ్జనార్

image

TG: ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC MD సజ్జనార్ హెచ్చరించారు. ‘స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ ఘటనను ఆయన పంచుకున్నారు.

Similar News

News December 9, 2025

నేడు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

TG: ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 10గంటలకు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పలు కారణాలతో 6 జిల్లాల్లో(ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్) ఈ కార్యక్రమం జరగదు. కాగా ఈ ఒక్కో విగ్రహానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.5.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

News December 9, 2025

ఈ రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.

News December 9, 2025

నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

image

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.