News April 6, 2024
హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రావొద్దు

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.
Similar News
News November 11, 2025
టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.
News November 11, 2025
స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
News November 11, 2025
రాష్ట్రంలో 175 పారిశ్రామిక పార్కులు: CBN

AP: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతామని CM CBN ప్రకటించారు. ‘ఇపుడు15 MSMEలు ప్రారంభించాం. మరో 35కి శంకుస్థాపన చేశాం. కొత్తగా మరో 70 ఏర్పాటుచేస్తాం’ అని చెప్పారు. వీటిలో 99 పరిశ్రమలు రానున్నాయన్నారు. ప్రధాని మోదీ దేన్ని ప్రవేశపెట్టినా APకి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో PPAల రద్దుతో ₹9వేల CR వృధా చేశారన్నారు. పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్నారు.


