News April 3, 2024
WARNING: ఈ టైంలో బయటకు రావొద్దు
TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను వైద్యారోగ్యశాఖ అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంది. ఎండలో పనిచేయడం, ఆటలాడటం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని కోరింది. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.
Similar News
News January 4, 2025
‘హరిహరవీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మాట వినాలి’ అనే సాంగ్‌ను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
News January 4, 2025
పోలవరం ప్రభావంపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం
TG: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. 2022లో గోదావరికి వచ్చిన వరదలతో భద్రాచలం ఆలయం ముంపునకు గురైందని తాజా సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు.
News January 4, 2025
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, జపాన్ మహిళ టోమికో ఇటూకా(116) కన్నుమూశారు. 2019 నుంచి ఈమెను ఒసాకా సిటీలోని నర్సింగ్ హోమ్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో DEC 29న మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 1908 మే23న ఒసాకాలో జన్మించిన ఈమెకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవళ్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మరియా(117) గత ఏడాది మరణించడంతో ఇటూకా ఓల్డెస్ట్ మహిళగా గుర్తింపు పొందారు.