News March 14, 2025
WARNING: మూడు రోజుల పాటు వడగాలులు

AP: కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News March 14, 2025
అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్ నుంచి జైపూర్ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.
News March 14, 2025
OTTలోకి వచ్చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
News March 14, 2025
RSS, BJPకి సారీ చెప్పను: గాంధీ మునిమనుమడు

RSS, BJPకి క్షమాపణ చెప్పనని, వాటిపై వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకోనని మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ తెలిపారు. అవి రెండూ ప్రమాదకరం, విషపూరితం, దేశానికి అంతర్గత శత్రువులంటూ ఈ మధ్యే ఆయన విమర్శించారు. ఆయన సారీ చెప్పాలని, కేసు నమోదు చేయాలని సంఘ్, BJP నేతలు డిమాండ్ చేశారు. ‘ద్రోహులను మరింత బయటపెట్టాలన్న నా పట్టుదలకు జరిగిన ఘటన బలం చేకూర్చింది. స్వతంత్ర పోరాటం కన్నా ఇదే అతి ముఖ్యం’ అని తుషార్ అన్నారు.