News August 2, 2024

ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు హెచ్చరిక

image

ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని తెలిపింది. మరోవైపు ఆగస్టు 8 వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Similar News

News December 2, 2025

ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

image

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.

News December 2, 2025

సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

image

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.

News December 2, 2025

‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

image

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.