News October 10, 2024

Microsoft Edge యూజర్లకు వార్నింగ్

image

Microsoft Edge యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలంది. 129.0.2792.79 ముందు వెర్షన్లలో భద్రతా లోపాలు ఉన్నాయని CERT-In తెలిపింది. ఇవి సెక్యూరిటీ కంట్రోల్స్‌ను బైపాస్ చేసి ఫోన్లు, కంప్యూటర్లలో రిమోట్ అటాకర్స్, సైబర్ క్రిమినల్స్ తమ సొంత కోడ్‌ను జొప్పించేందుకు అవకాశం కల్పిస్తాయంది. మలీషియస్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ చేసి పర్సనల్ డేటా చోరీకి సాయపడతాయని హెచ్చరించింది.

Similar News

News September 15, 2025

సీఎం రేవంత్ వద్దకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంచాయతీ!

image

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ పంచాయితీ సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ విషయమై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి సమావేశ సారాంశం, కాలేజీ యాజమాన్యాల డిమాండ్లను మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేసే ఆస్కారముందని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.

News September 15, 2025

బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. తొలి రోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి.

News September 15, 2025

శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? (1/2)

image

శివుడు త్రినేత్రుడు. మరి ఆయనకు మూడో నేత్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ‘శివుడు ఒకనాడు ధ్యానంలో ఉండగా పార్వతీ దీవి సరదాగా వెళ్లి ఆయన కళ్లు మూసింది. దీంతో లోకమంతా చీకటి ఆవహించింది. అప్పుడు శివుడు తన శక్తులను ఏకం చేసి నుదుటిపై మూడవ నేత్రాన్ని ఆవిష్కరించి, తెరిచాడు. లోకాన్ని వెలుగుతో నింపాడు’ అని పండితులు చెబుతున్నారు. ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.