News August 20, 2024

మోహన్‌లాల్‌కు వైద్యుల హెచ్చరికలు

image

మలయాళ నటుడు మోహన్‌లాల్ శ్వాస సంబంధిత సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరించారని సమాచారం. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, లాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News December 26, 2025

మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

image

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

News December 26, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.

News December 26, 2025

భారత్ ఘన విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.