News May 10, 2024
ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్లపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 73 సీఆర్పీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Similar News
News December 5, 2025
సిరిసిల్ల: ‘బస్సులో నగదు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్’

డబ్బుల బ్యాగులు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగును బస్సులో నుంచి బండారి బాలరాజు ఎత్తుకెళ్లాడన్నారు. ఆ బ్యాగులో రూ.3,97,500 నగదు ఉందని బాధితులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.


