News October 3, 2025
నిన్న నాన్‌వెజ్ ఎక్కువైందా? ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆయుధ, శమీ పూజలతో మొదలెట్టి రాత్రి రావణ దహనంతో వేడుకలను ముగించారు. గాంధీ జయంతి అయినప్పటికీ మాంసం, మద్యం విషయంలో చాలామంది కాంప్రమైజ్ కాలేదు. నిన్న నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నవారు ఇవాళ లైట్, ఫైబర్ రిచ్, లోఫ్యాట్ డైట్ పాటిస్తూ ప్రోబయాటిక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేషన్ కోసం నీరెక్కువగా తాగాలంటున్నారు. SHARE IT
Similar News
News October 3, 2025
అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. స్పందించిన సనా మిర్

WWCలో భాగంగా PAK, BAN మ్యాచ్ సందర్భంగా పాక్ కామెంటేటర్ సనా మిర్ చేసిన <<17897473>>అజాద్ కశ్మీర్<<>> వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రాజకీయ కోణంలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్లేయర్ నటాలియా పడిన కష్టాలను చెప్పే క్రమంలో ఆ పదాన్ని వాడినట్లు వివరించారు. అనుకోకుండా వాడిన పదానికి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.
News October 3, 2025
వరుస ట్వీట్లు.. అకౌంట్ క్లోజ్!

నిన్న Xలో వరుస <<17895726>>పోస్టులు<<>> చేసిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అకౌంట్ కనిపించకుండా పోయింది. KCR, KTRను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా Xలో ఆయన అకౌంట్ కోసం వెతికితే కనిపించట్లేదు. ఈ క్రమంలో ఆయనే అకౌంట్‌ను బ్లాక్ చేశారా లేదా X ఏమైనా చర్యలు తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.
News October 3, 2025
రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు

వరుసగా <<17892412>>రెండో రోజూ<<>> బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.650 తగ్గి రూ.1,18,040కు చేరింది. 22K బంగారం 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.1,08,200 వద్ద కొనసాగుతోంది. నిన్న పెరిగిన వెండి ధరలు ఇవాళ తగ్గాయి. వెండి కిలోకి రూ.3 వేలు తగ్గడంతో ధర రూ.1,61,000గా ఉంది.