News August 11, 2024
కొట్టుకుపోయిన డ్యామ్ గేట్.. లక్ష క్యూసెక్కుల విడుదల

తుంగభద్ర డ్యామ్ <<13826054>>గేట్<<>> కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా అధికారులు అన్ని గేట్లు ఎత్తేశారు. లక్ష క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ నిపుణుల బృందం డ్యామ్‌ను పరిశీలించనుంది. గేట్ కొట్టుకుపోవడంతో కర్నూలులోని పలు మండలాలకూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News October 20, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
News October 20, 2025
అమితాబ్‌తో దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన పిల్లాడు!

ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో హల్చల్ చేసిన పిల్లాడు గుర్తున్నాడా?<<17994167>>అమితాబ్‌తో దురుసుగా<<>> ప్రవర్తించి నెట్టింట వైరలయ్యాడు. ఈ మేరకు ఇషిత్ భట్ తన ప్రవర్తనకు సారీ చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ‘నేను అప్పుడు నర్వస్‌గా ఉన్నా. అంతేతప్ప దురుసుగా ప్రవర్తించడం నా ఉద్దేశం కాదు. అమితాబ్‌ను ఎంతో గౌరవిస్తా. ఈ ఘటనతో పెద్ద పాఠం నేర్చుకున్నా. భవిష్యత్తులో మరింత వినయంగా ఉంటానని మాటిస్తున్నా’ అని చెప్పాడు.
News October 20, 2025
నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం: కెనడా ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తమ దేశంలో అమలు చేస్తామని కెనడా పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. నెతన్యాహు తమ దేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధ నేరాలకు గాను 2024 నవంబర్ 21న నెతన్యాహుపై ICC అరెస్ట్ <<14671651>>వారెంట్ జారీ <<>>చేసిన విషయం తెలిసిందే.