News June 19, 2024
అప్పటి YCP విజయం నిజం కాదా?: యామినీ శర్మ

AP: ఈవీఎంలపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని BJP నాయకురాలు సాధినేని యామినీ శర్మ మండిపడ్డారు. 2019లో YCPకి ప్రజలకు 151 సీట్లు కట్టబెట్టినపుడు ఉపయోగించింది ఇవే ఈవీఎంలు అని అన్నారు. అప్పుడు మాత్రం వాటి నిషేధం గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. అంటే నాటి వైసీపీ విజయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో YCP భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు.
Similar News
News January 6, 2026
27 రైళ్లకు స్పెషల్ హాల్ట్లు

TG: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7-20 వరకు మొత్తం 27 ఎక్స్ప్రెస్ రైళ్లకు స్పెషల్ హాల్ట్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్-విజయవాడ మార్గంలోని 11 రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో హాల్ట్ ఏర్పాటు చేశారు. దీంతో IT ఉద్యోగులు, నగర ప్రయాణికులకు ఊరట లభించనుంది.
News January 6, 2026
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News January 6, 2026
సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా 5 వేలకు పైగా బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలకు 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి మీరు పండుగకు ఊరెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా?


