News November 6, 2024

WATCH: ‘భైరవం’ నుంచి నారా రోహిత్ లుక్

image

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. ఈ సినిమా నుంచి నారా రోహిత్ ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ రివీల్ చేసింది. యాంగ్రీ లుక్‌లో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Similar News

News April 2, 2026

RECORD: ‘యశోద-కృష్ణ’ పెయింటింగ్‌కు ₹167కోట్లు

image

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద-కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్‌ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలో జరిగిన వేలంలో ఈ చిత్రం ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడైంది. భారతీయ కళా చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రంగా ఇది నిలిచింది. గతంలో ఈ రికార్డు MF హుస్సేన్ గీసిన ‘అన్‌టైటిల్డ్’ పెయింటింగ్‌పై ఉండేది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ సైరస్ పూనావాలా ఈ అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు.

News April 2, 2026

మరోసారి తగ్గిన గోల్డ్ రేటు

image

పెట్టుబడిదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ప్రకటనతో డాలర్‌పై ఒత్తిడి, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు ఇవాళ <<19544455>>మరోసారి<<>> పడిపోయాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,980 తగ్గి రూ.1,48,970కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 పతనమై రూ.1,36,550 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది. తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు ఊరటనివ్వనున్నాయి.

News April 2, 2026

చట్టబద్ధతతో శాశ్వత రాజధానిపై స్పష్టత: రామ్మోహన్

image

విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధతతో ప్రజలకు స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. 2014లోనే అమరావతిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. కానీ 2019-24 మధ్య YCP ప్రభుత్వం 3 రాజధానుల నాటకమాడిందని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను హింసించిందని ఆరోపించారు.