News November 8, 2024

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేప‌ర్‌‌తో

image

పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా క‌నిపిస్తున్నా ఇది న‌కిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేప‌ర్‌ను ఉప‌యోగించి త‌యారు చేశారు. యూపీలోని సోన్‌భ‌ద్రా జిల్లాకు చెందిన స‌తీశ్ రాయ్‌, ప్ర‌మోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో ప‌నిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల త‌యారీ నేర్చుకున్నారు. న‌కిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.

Similar News

News September 17, 2025

ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.

News September 17, 2025

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్‌ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.