News November 8, 2024
యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేపర్‌తో
పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా కనిపిస్తున్నా ఇది నకిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేపర్‌ను ఉపయోగించి తయారు చేశారు. యూపీలోని సోన్‌భద్రా జిల్లాకు చెందిన సతీశ్ రాయ్, ప్రమోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో పనిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల తయారీ నేర్చుకున్నారు. నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.
Similar News
News December 13, 2024
టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఏపీ: పవన్ కళ్యాణ్
AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు
News December 13, 2024
ప్రభాస్ ‘కల్కి’ మరో ఘనత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా మరో ఘనత సాధించింది. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వెతికిన మూవీగా నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ ఇండియా పేర్కొంది. ‘ఆలస్యం అయ్యిందా? కల్కి ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోవడంతో ఈలలు వేయడాన్ని ఆపలేకపోయారు. కల్కి 2024లో అత్యధిక ట్రెండింగ్ అయిన చలన చిత్ర శోధనలో ఒకటిగా నిలిచింది’ అని తెలిపింది.
News December 13, 2024
జడ్జిలు ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేయొద్దు: సుప్రీంకోర్టు
ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు రుషుల్లా జీవిస్తూ గుర్రాల్లాగా పనిచేయాలని, తీర్పులపై కామెంట్లు చేయొద్దని జస్టిస్‌లు నాగరత్న, కోటీశ్వర్ సింగ్ బెంచ్ పేర్కొంది. అలాచేస్తే భవిష్యత్తు విచారణల్లో ఆ తీర్పులను కోట్ చేయాల్సొస్తే ఇబ్బంది తప్పదని వెల్లడించింది. MP హైకోర్టు ఇద్దరు ప్రొబేషనరీ మహిళా న్యాయాధికారుల టర్మినేషన్ కేసు విచారణలో ఇలా వ్యాఖ్యానించింది.