News November 10, 2024

రాబోయే 4 రోజులు జాగ్రత్త: APSDMA

image

నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 14 వరకు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 4 రోజుల వాతావరణ వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది

Similar News

News January 16, 2026

యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

image

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్‌ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

News January 16, 2026

NZతో టీ20 సిరీస్.. సుందర్ దూరం, జట్టులోకి శ్రేయస్

image

NZతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసింది. అలాగే తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీమ్‌లోకి వచ్చారని తెలిపింది.
టీమ్: సూర్య (C), అభిషేక్, శాంసన్, శ్రేయస్, హార్దిక్, దూబే, అక్షర్, రింకూ, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్, రవి బిష్ణోయ్

News January 16, 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని DFS ప్రవేశపెట్టింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ దీన్ని అమలు చేయాలని సూచించింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కార్డుల సేవలు ఇందులో ఉంటాయి. దీనివల్ల అన్ని కేటగిరీల వారికి ₹1.5 CR-₹2 CR వరకు ప్రమాద బీమా కవర్ కానుంది. వైకల్యం ఏర్పడితే ₹1.5CR అందుతుంది. జీరో బ్యాలెన్స్, తక్కువ వడ్డీకే హౌసింగ్, ఎడ్యుకేషన్, వెహికల్, పర్సనల్ రుణాలు అందుతాయి.