News March 20, 2025
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్.. చివరికి!

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో ఆపరేషన్‌కు ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. UP మధురలో ఈ ఘటన జరిగింది. అనేక మంది వైద్యులను సంప్రదించినా రాజబాబు(32)కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మత్తు ఇంజెక్షన్, ఇతర సామగ్రి కొని ఆపరేషన్ మొదలుపెట్టాడు. మత్తు ప్రభావం తగ్గడంతో నొప్పి ఎక్కువై అరుస్తూ బయటికి పరిగెత్తగా, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 21, 2025
జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నెక్స్ట్ ఏంటి?

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా నగదు బయటపడింది. ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆగ్రహించింది. ఈ ఘటన న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తుందని, వర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై వర్మ నుంచి CJI వివరణ కోరనున్నారు. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అంతర్గత విచారణకు ఆదేశిస్తారు.
News March 21, 2025
హనీట్రాప్: కర్ణాటక కాంగ్రెస్‌లో చీలిక!

కర్ణాటకలో 48 మంది నేతలు హనీట్రాప్‌లో చిక్కినట్టు స్వయంగా కాంగ్రెస్ మంత్రే బయటపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు మంత్రులు, MLAలు వలపు వలలో చిక్కారని, దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం వర్గపోరుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. సొంతపార్టీ నేతలపై విచారణ కోరడమే ఇందుకో ఉదాహరణగా చెప్తున్నారు. CM సిద్దరామయ్య, DYCM శివకుమార్ విభేదాలు పార్టీలో చీలికను సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News March 21, 2025
REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్‌కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT