News June 29, 2024

రోహిత్‌ను చూస్తోంటే ముచ్చటేస్తోంది: గంగూలీ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూస్తోంటే పట్టరాని ఆనందంగా ఉందని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఆయన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. ‘నేను BCCI అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రోహిత్ కెప్టెన్సీ చేపట్టారు. అసలు రోహిత్‌కు కెప్టెన్సీ చేయడమే ఇష్టం లేదు. కానీ మేమే ఆయనను ఒప్పించేందుకు నానా తంటాలు పడి బలవంతంగా ఒప్పించాం. ఇప్పుడు అతడి సారథ్యంలో ప్రపంచకప్ సాధించబోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News July 1, 2024

DOCTORS DAY: వైద్యో నారాయణో హరి!

image

వైద్యులు దేవుళ్లతో సమానమని చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తోన్న వైద్యుల దినోత్సవం నేడు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడారు. వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

News July 1, 2024

నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

image

పశ్చిమ బెంగాల్‌ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.

News July 1, 2024

మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.