News April 13, 2025
SRH ఛేజింగ్ చూస్తే నవ్వొస్తోంది: శ్రేయస్ అయ్యర్

SRH ఓపెనర్లు అద్భుతంగా ఆడారని, తాను ఇప్పటి వరకు చూసిన ఇన్నింగ్స్‌లలో అభిషేక్ బ్యాటింగ్ అత్యుత్తమమని SRHతో ఓటమి తర్వాత PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొనియాడారు. 245రన్స్‌ను 9బంతులు మిగిల్చి ఛేదించడం చూస్తే నవ్వొస్తోందని చెప్పారు. అభిషేక్ అదృష్టవంతుడని, అతని క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత చెలరేగి ఆడాడని తెలిపారు. తొలుత 230స్కోర్ చేస్తే గెలుస్తామని భావించినా, 2వ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపిందన్నారు.
Similar News
News October 16, 2025
శుభ సమయం (16-10-2025) గురువారం

✒ తిథి: బహుళ దశమి మ.1.40 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష సా.4.27 వరకు
✒ శుభ సమయం: సా.6.10-7.00
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48
✒ వర్జ్యం: ఉ.6.56 వరకు
✒ అమృత ఘడియలు: మ.2.52-మ.4.26
* ప్రతిరోజూ <<-se_10009>>పంచాంగం<<>>, <<-se_10008>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.
News October 16, 2025
నేటి ముఖ్యాంశాలు

❁ రేపు ఏపీకి ప్రధాని.. ₹13వేల కోట్ల పనులకు శ్రీకారం
❁ నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CM CBN
❁ ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్
❁ TG: ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్ బాబు
❁ మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్
❁ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి
❁ ఈ నెల 18న బంద్.. మద్దతు తెలిపిన BRS, BJP
❁ MH సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
News October 16, 2025
T20 WCకు అర్హత సాధించిన నేపాల్, ఒమన్

భారత్-శ్రీలంకలో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు 19 దేశాలు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నేపాల్, ఒమన్ తమ బెర్తులు ఖరారు చేసుకోగా మరో స్లాట్ ఖాళీగా ఉంది. దాన్ని UAE సొంతం చేసుకునే అవకాశం ఉంది.
జట్లు: భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, USA, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్.