News December 7, 2024

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు

image

ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి’ అని సూచించారు.

Similar News

News October 16, 2025

లాభాల్లో మొదలైన మార్కెట్లు

image

వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బెల్, టైటాన్, మహీంద్రా&మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎటర్నల్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉండగా ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News October 16, 2025

వారంలోగా వాస్తవాలు తెలపండి: కృష్ణా బోర్డు

image

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు DPR తయారీకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారంలో వాస్తవాలు తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. DPR, ప్రాజెక్టు పనులన్నీంటినీ ఆపాలని TG ENC అంజాద్ ఇటీవల CWCకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా CWCని ఆదేశించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బోర్డు స్పందించి తాజా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.