News March 29, 2025

ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది.

Similar News

News March 31, 2025

సన్‌రైజర్స్‌తో చర్చలకు సిద్ధం: HCA

image

సన్‌రైజర్స్ జట్టుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మాకు కేటాయించిన వాటికి మించి అదనపు పాసుల్ని ఎప్పుడూ అడగలేదు. అసోసియేషన్ పరువుకు భంగం కలిగించే పద్ధతి మంచిది కాదు. మ్యాచ్‌లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నాం. ఏదేమైనా సన్‌రైజర్స్ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాయి.

News March 31, 2025

ఎల్లుండే లోక్‌సభలోకి వక్ఫ్ సవరణ బిల్లు?

image

వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి ముందే బీజేపీ సీనియర్ నేతలు ఇండీ కూటమి నేతలతో సమావేశమై చర్చించొచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆలోపుగా ఉభయ సభలూ ఆమోదిస్తేనే బిల్లు చట్టరూపం దాల్చుతుంది.

News March 31, 2025

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వ వైభవం తేవాలి: సీఎం

image

AP: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కుశాఖ అధికారులు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన, బ్లాస్ట్ ఫర్నేస్ తదితర అంశాలపై చర్చించారు. ఉక్కు కర్మాగారానికి, ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం అన్నారు. దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీకి SPFతో భద్రత కల్పిస్తామన్న సీఎంకు శ్రీనివాసవర్మ ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!