News March 24, 2025
స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: సీఎం

AP: ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా.4గంటల్లోపు పనులు అప్పగించొద్దు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి ₹39Cr విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం
News October 29, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.
News October 29, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: గద్వాల్, MBNR, NGKL, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HNK, HYD, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, WGL జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ప్రాంతంలో వాన పడుతోందా?


