News April 8, 2024

Water Crisis: హైదరాబాదీ ఇకనైనా మేలుకో!

image

HYDలో విచ్చలవిడిగా‌ నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్‌ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్‌ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్‌ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER

Similar News

News September 10, 2025

HYD: కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర: మంత్రి

image

జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినా లాభం లేదని, ప్రభుత్వం మారదని, ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు HYDలో KTR వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర సాధ్యమని, BRSఎన్నికల్లో బీరు-బిర్యానీ సంస్కృతి తెచ్చిందన్నారు. జూబ్లిహిల్స్‌లో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చింది KTR కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

News September 10, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రచారంపై లీగల్ నోటీసులు పంపిస్తా: కార్తీక్ రెడ్డి

image

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చేరుతున్నట్లు వార్తలు రాస్తున్న మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించే వార్తా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.

News September 10, 2025

HYD: హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

image

HYD హైకోర్టు ఎదుట బుధవారం అడ్వకేట్లు పాంప్లెట్లతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సురేశ్ బాబుపై జరిగిన దాడికి నిరసనగా గేట్ నంబర్ 6 వద్ద నిరసన ప్రోగ్రాం నిర్వహించారు. వెంటనే సత్వర న్యాయం జరగాలని అందరూ కలిసి డిమాండ్ చేశారు.