News September 11, 2025

సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల

image

AP: సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే CM వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే CM లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 11, 2025

గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

image

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.

News September 11, 2025

‘మిరాయ్‌’లో ప్రభాస్?

image

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రిలీజ్ నేపథ్యంలో.. హింట్ ఇస్తూ హీరో తేజ ట్వీట్ చేశారు. ‘ప్రభాస్ తన సహృదయంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చారు. మూవీ ప్రారంభంలో రెబల్ సర్‌ప్రైజ్ మిస్ అవకండి’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా క్యామియో ఉంటుందా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ కానుంది.

News September 11, 2025

ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్‌‌కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.