News April 8, 2024
నేటి నుంచి సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

AP: నాగార్జున సాగర్ కుడి కాలువకు నేటి నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం గేట్లను తెరవనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 18 వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. అటు తెలంగాణకు వచ్చే ఎడమ కాలువకు ఈ నెల 1 నుంచి 7 వరకు 2.3 టీఎంసీల నీటిని వదిలారు.
Similar News
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <
News January 6, 2026
ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

టోక్యోలోని టొయోసు మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్‌లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.
News January 6, 2026
బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్‌ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్‌ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్)ను కెప్టెన్‌గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.


