News December 31, 2024
WAVES.. అసలైన గేమ్‌ఛేంజర్: రామ్ చరణ్
2025లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES) నిర్వహిస్తామని PM మోదీ ప్రకటించడంపై హీరో రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మోదీ ప్రభుత్వం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ సహకారానికి వేవ్స్ అసలైన గేమ్ ఛేంజర్ కానుంది’ అని ట్వీట్ చేశారు. వేవ్స్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటారని ఇటీవల మన్‌కీబాత్‌లో ప్రధాని వెల్లడించిన విషయం తెలిసిందే.
Similar News
News February 5, 2025
Breaking: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటిది ఆ ఫామ్‌కు నిప్పుపెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్‌గేట్స్
తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్‌తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.
News February 5, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.