News October 31, 2024
Way2 Special.. కరీంనగర్: శ్మశానంలో దీపావళి!

దీపావళిని సాధారణంగా ఇంట్లో అందరితో కలిసి టపాసులు కాల్చుతూ జరుపుకుంటారు. కానీ, మన కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 6 దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో జరుకుంటున్నారు. అదెక్కడో కాదండోయ్! నగరంలోని కార్ఖనగడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరణించిన తమ బంధువుల సమాధుల వద్ద నైవేద్యాలు, కొవ్వొత్తులు వెలిగించి, పిండివంటలు పెట్టి టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
Similar News
News September 19, 2025
కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.
News September 19, 2025
శంకరపట్నం: యాదవ్ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐలయ్య యాదవ్

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గుండెవేని ఐలయ్య యాదవ్‌ను యాదవ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర యాదవ చైతన్య వేదిక అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఈ నియమకం జరిగినట్లు చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News September 19, 2025
KNR: సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా షేక్ నిసార్ అహ్మద్

కరీంనగర్ జిల్లా సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ షేక్ నిసార్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లోని రెవెన్యూ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం షేక్ నిసార్ అహ్మద్ చేస్తున్న పోరాటాన్ని స్థితప్రజ్ఞ ప్రశంసించారు.