News March 14, 2025
Way2News ఎఫెక్ట్.. వీరభద్రపేట రోడ్డుకు మోక్షం

దేవరాపల్లి(M) వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. Way2News ఆ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వెలుగులోకి తెచ్చింది. మార్చి 4న గ్రామస్థుల సమస్యలపై ప్రత్యేక వీడియో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రూ.84లక్షల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Similar News
News October 22, 2025
నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?
News October 22, 2025
సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన: కలెక్టర్

తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని చెప్పారు. 2047 నాటికి దేశ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు.
News October 22, 2025
సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.