News March 14, 2025

Way2News ఎఫెక్ట్.. వీరభద్రపేట రోడ్డుకు మోక్షం

image

దేవరాపల్లి(M) వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. Way2News ఆ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వెలుగులోకి తెచ్చింది. మార్చి 4న గ్రామస్థుల సమస్యలపై ప్రత్యేక వీడియో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రూ.84లక్షల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

Similar News

News March 20, 2025

టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.

News March 20, 2025

భువనగిరి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు గాను 6,035 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు బాటపట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపించింది.

News March 20, 2025

MGUలో అభివృద్ధి పనులు సాగేదెలా..?

image

MG యూనివర్సిటీకి ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నాయి. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా కేటాయించకపోవడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు.

error: Content is protected !!