News November 13, 2025
Way2News ఎఫెక్ట్.. రూ.4.5 కోట్ల స్కాంపై ఎంక్వయిరీ

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో రూ.4.5కోట్ల స్కాం అంటూ <<18192226>>Way2Newsలో కథనం<<>> ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ విచారణ చేపట్టింది. నేడు హాస్పిటల్ చేరుకున్న విచారణ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో నిషితంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, బిల్స్, రిసిప్ట్‌లపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News November 13, 2025
A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

మంగళంపేటలో 75.74ఎకరాలకే పట్టాలు ఉండగా.. పెద్దిరెడ్డి కుటుంబం 32.63ఎకరాల అటవీ భూమిని తమ స్థలంలో కలిపేసుకున్నారని PCCFచలపతిరావు వెల్లడించారు. ‘ఏ1గా మిథున్ రెడ్డి, ఏ2గా రామచంద్రా రెడ్డి, ఏ3గా ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాం. అటవీ భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసి ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది’ అని ఆయన చెప్పారు.
News November 13, 2025
భద్రాద్రి జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరమన్నారు. 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14,500 ఎకరాల లక్ష్యంలో 8,163 ఎకరాలకు చేరామన్నారు.
News November 13, 2025
ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.


