News March 14, 2025
Way2News ఎఫెక్ట్.. వీరభద్రపేట రోడ్డుకు మోక్షం

దేవరాపల్లి(M) వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. Way2News ఆ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వెలుగులోకి తెచ్చింది. మార్చి 4న గ్రామస్థుల సమస్యలపై ప్రత్యేక వీడియో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రూ.84లక్షల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Similar News
News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో రేపు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంపై సంబంధ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో ప్రజలు భాగం కావాలని పిలుపునిచ్చారు.
News March 14, 2025
ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం ప్రతి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు.
News March 14, 2025
మహిళలకు బాపట్ల జిల్లా ఎస్పీ సూచనలు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించటానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీ మహిళ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.