News August 22, 2025
Way2News కథనానాకి స్పందన.. వెలిగిన జనగామ బ్రిడ్జి లైట్లు

‘గాండాంధకారంగా జనగామ బ్రిడ్జి’ అనే శీర్షికతో ఇటీవల Way2News ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. సంవత్సరం నుంచి లైట్లు సరిగా వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. దీంతో వార్త ప్రచురించగా.. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బ్రిడ్జిపై ఉన్న లైట్లకు మరమ్మతులు చేయించి లైట్లు వెలిగేలా చేశారు. స్థానికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News August 22, 2025
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ!

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మ.2 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 3.15 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగడియాతో సమావేశమవుతారు. సా.5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సాంకేతికశాఖ కార్యదర్శి అభయ్ కరందికర్‌ను కలిసి వివిధ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
News August 22, 2025
ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి

AP: వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏకు మద్దతిచ్చిన క్రమంలో ఆయన ఖర్గేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఖర్గేతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానని మేడా స్పష్టం చేశారు. దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
News August 22, 2025
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే?

1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి నిర్మాత కేఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్, వరుణ్ తేజ్‌ను మెగా ప్రిన్స్, నిహారికను మెగా డాటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.