News December 13, 2025

Way2News కథనానికి స్పందించిన సీతక్క

image

ఏటూరునాగారంలోని రామన్నగూడెం రోడ్డు 7వ వార్డులో వైన్ షాపు ఇళ్ల మధ్య ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం <<18545026>>’మానాభిమానాల కంటే వైన్ షాపు ముఖ్యమా..?’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురించగా మంత్రి సీతక్క స్పందించారు. నివాసాల మధ్య వైన్ షాపును ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీంతో స్థానికులు, సీతక్కకు, Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 15, 2025

బిజినేపల్లి: వార్డు మెంబర్‌గా గెలిచి హఠాన్మరణం

image

బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా జుర్రు మహేశ్ యాదవ్(34) పోటీ చేసే విజయం సాధించారు. అర్ధరాత్రి హఠాత్తుగా మృత్యువాత పడటం గ్రామంలో విషాదం నింపింది. ఆయన మరణంపై కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News December 15, 2025

భద్రకాళి సన్నిధిలో మోగ్లీ చిత్ర యూనిట్

image

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలయిన మోగ్లీ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

News December 15, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్