News December 17, 2025

Way2News కథనానికి స్పందించిన సీతక్క

image

Way2News కథనానికి మంత్రి సీతక్క స్పందించారు. మంగపేట మండలం దోమడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏటూరునాగారంలో ఈనెల 9న ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా మంగళవారం<<18583277>> ‘మంత్రి సీతక్క.. ఆదుకోవా’ <<>>అనే శీర్షిక Way2News ద్వారా ప్రచురించగా సీతక్క స్పందించారు. బాధితుడితో ఫోనులో మాట్లాడి చికిత్సకు తోడ్పడతానని హామీ ఇచ్చారు.

Similar News

News December 19, 2025

నెల్లూరు: 21 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో 21 నుంచి 23వ తేదీ వరకు 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో కార్యక్రమం జరగనుంది. 2.94 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2396 పోలియో బూత్‌లలో వీరికి చుక్కలమందు వేయనుండగా.. 403 హై రిస్క్ ఏరియాలు, 82 మొబైల్ బూత్‌లు, బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల వద్ద ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 19, 2025

ఆసిఫాబాద్: ఓటుకు ‘మహారాష్ట్ర’ మందు..?

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర మద్యం ఏరులై పారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పొరుగు రాష్ట్రం నుంచి దేశీ దారును భారీగా దిగుమతి చేసుకున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు ఉన్నప్పటికీ, అక్రమ మార్గాల్లో తరలించి పంపిణీ చేసినట్లు సమాచారం. ASF, MNCL జిల్లాల్లోని దాదాపు 150 గ్రామాల్లో ఈ మద్యం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా పడినట్లు తెలుస్తోంది.

News December 19, 2025

సంగారెడ్డి:ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ నెల 22, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు,29,30 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.