News October 4, 2024

Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం

image

గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్‌లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 4, 2024

బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం బన్నీ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.

News October 4, 2024

ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు సహా 24 మందిపై కేసు

image

కర్నూలు జిల్లాలోని రెన్యూ విండ్‌ పవర్‌, గ్రీన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరూపాక్షి తమ్ముడు, వైసీపీ నేత బసినె వెంకటేశ్‌‌తో పాటు మరో 23 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు.

News October 4, 2024

కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల

image

రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్‌లో 153 మంది, మూడో సెమిస్టర్‌‌లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్‌లో 32 మంది, మూడో సెమిస్టర్‌లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్‌లో 38 మంది, మూడో సెమిస్టర్‌లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.