News January 14, 2025

Way2News: 24 గంటలూ వార్తల ‘పండుగే’

image

‘ఈరోజు సంక్రాంతి సెలవు కారణంగా రేపు పేపర్ రాదు. పునర్దర్శనం గురువారం’ అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈరోజు వార్తలను చదివేందుకు మీరు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పని లేదు. ఎప్పటిలాగే పండుగ నాడు కూడా Way2News ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సెలవుల్లోనూ 24/7 బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కంటెంట్ వస్తూనే ఉంటాయి.
*Way2News యూజర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు

Similar News

News January 14, 2025

GOOD NEWS: సైనిక్ స్కూళ్లు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>https://exams.nta.ac.in/AISSEE/<<>> సైట్‌ను సంప్రదించగలరు.

News January 14, 2025

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

image

హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

News January 14, 2025

అధికారుల తీరుపై మంత్రి పొన్నం నిరసన

image

TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్‌మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.