News September 12, 2025

నేడు విజయవాడలో Way2News కాన్‌క్లేవ్

image

AP: విజయవాడలో ఇవాళ Way2News కాన్‌క్లేవ్ నిర్వహించనుంది. CM చంద్రబాబుతో పాటు కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు, MPలు భరత్, హరీశ్ బాలయోగి పాల్గొననున్నారు. YCP నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కాన్‌క్లేవ్‌కు హాజరుకానున్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మ.12గంటల నుంచి యాప్‌లో LIVE వీక్షించొచ్చు.

Similar News

News March 5, 2026

టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

image

AP: టెన్త్ విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. హాల్‌టికెట్లను కండక్టర్లకు చూపిస్తే ఈ నెల 16 నుంచి APR 1 వరకు పరీక్షా కేంద్రాలకు, ఇంటికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతాం’ అని పేర్కొంది.

News March 5, 2026

X-RAY లేని కాలంలో గర్భస్థ శిశువుపై శిల్పాలు!

image

కేరళంలోని త్రిశూర్‌లో ఉన్న వడుగనాథ స్వామి ఆలయం భారతీయ శిల్పకళా చాతుర్యానికి, అప్పటి శాస్త్ర విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఎక్స్-రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే గర్భంలోని శిశువు నెలవారీ ఎదుగుదల భంగిమలను కళ్లకు కట్టినట్లు చెక్కారు. నిజంగా మన పూర్వీకులకు గర్భస్థ శిశువుపై ఉన్న పరిజ్ఞానం ఎంత గొప్పదో కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News March 5, 2026

తిరుమల కొండపై దివ్వెల మాధురి అత్యుత్సాహం

image

AP: తిరుమలలో దివ్వెల మాధురి మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను ఆమె కొండపై ఓ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించారు. అయితే తిరుమలకు కేక్ తీసుకెళ్లడం నిషిద్ధం. ఈ ఘటనపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. గతంలోనూ MLC దువ్వాడ శ్రీనుతో కలిసి ఆమె తిరుమల ఆలయం ఎదుట రీల్స్ చేశారు. విమర్శలు రావడంతో ఇంకోసారి తప్పు చేయనంటూ క్షమాపణ చెప్పారు. తాజా ఉదంతంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.