News March 25, 2025

Way2News Effect.. GWL: అనాథలను అక్కున చేర్చుకున్నారు

image

మల్దకల్ మండలం చర్లగార్లపాడుకు చెందిన భారతి, వీరేష్ దంపతులు మృతి చెందగా వారి <<15881203>>ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు<<>>. విషయం తెలుసుకున్న కుమ్మర శాలివాహన సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాతల ద్వారా రూ.4.15లక్షలు సేకరించారు. నగదును మంగళవారం మల్దకల్ యూనియన్ బ్యాంక్‌లో చిన్నారులు నందకిషోర్, వైష్ణవి, గణేష్ పేర్లమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లు అందజేశారు. శాలివాహన సంఘం నేతలు పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

మోదీ పుట్టినరోజు.. లండన్‌లో పూజలు చేసిన మంత్రి లోకేశ్

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, మంత్రి నారా లోకేశ్ లండన్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. మోదీకి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నానని లోకేశ్ తెలిపారు. మోదీ మార్గదర్శకత్వంలో ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.

News September 17, 2025

SPMVV ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు నెలలో పీజీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ MBA (మీడియా మేనేజ్మెంట్) 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 17, 2025

బ్యాంకింగ్ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయండి: జేసీ

image

జిల్లాలోని రైతులకు పంట రుణాలు, మహిళా గ్రూపులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువత ఉపాధి రంగానికి అవసరమైన రుణాలను తక్షణమే మంజూరు చేయాలని జేసీ విష్ణు చరణ్ బ్యాంకర్లను సూచించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం రూ.15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యానికి గాను జూన్ 30 నాటికి రూ.5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు.