News August 31, 2025
Way2News EXCLUSIVE… కాళేశ్వరం రిపోర్ట్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <
Similar News
News September 1, 2025
అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: సుదర్శన్ రెడ్డి

రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.
News September 1, 2025
ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై దంపతుల నిద్ర

జపాన్ కపుల్స్ నాణ్యమైన నిద్ర కోసం ‘సపరేట్ స్లీపింగ్’ పద్ధతిని పాటిస్తారు. వారు ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై పడుకుంటారు. నిద్రలో గురక పెట్టడం, కదలడం వల్ల తమ భాగస్వామి నిద్రకు భంగం కలుగుతుందని ఇలా వేరుగా పడుకుంటారట. అయితే ఇది జంటల మధ్య దూరాన్ని పెంచుతుందని కొందరు భావిస్తే, భాగస్వామికిచ్చే గౌరవంగా మరికొందరు నమ్ముతున్నారు. కాగా జపాన్‌లో జననాల రేటు పడిపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది.
News September 1, 2025
రాష్ట్రంలో 63.61 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ: CM

AP: రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో.. లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది పెన్షనర్ల కోసం రూ.2,746.52 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 7,872 మందికి నెలకు రూ.4 వేలు చొప్పున స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేశారు.