News March 8, 2025
Way2News Special.. మహిళా దినోత్సవ సందర్భంగా దాశరధి కవిత్వం

ప్రముఖ కవి దాశరధి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందినవారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా “మహిళా మణులు మెరిసెను” అనే కవిత్వంలో మహిళల గొప్పతనాన్ని అయన ఇలా వర్ణించారు. మహిళా మణులు మెరిసెను, మాతృభూమి మలయమారుతమై పరిమళించెను, తల్లి ప్రేమ తుళ్లింతలై మమతారసిలే, సహనం, శాంతి, త్యాగధర్మం వారసత్వమైన నిలిచెను.. మహిళా మణులు మెరిసెను. అని వారి గొప్పతనాన్ని వర్ణించారు.
Similar News
News November 23, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

* రైలు ఢీకొని గొర్రెల కాపరితో పాటు 90 గొర్రెల మృతి
*మాచారెడ్డి మహిళల ఆర్థిక ఉన్నతి తోటే రాష్ట్ర ప్రగతి సాధ్యం
* జిల్లాలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
* సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు
* కామారెడ్డి: సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
* ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు
News November 23, 2025
ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.
News November 23, 2025
చీరలతో మహిళల మనసు.. రిజర్వేషన్లతో రాజకీయ లెక్కలు!

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో సందడి నెలకొనగా, మహిళలకు దగ్గరవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లే కనిపిస్తోంది. వచ్చే నెల స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని చూసుకోవాలన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు రిజర్వేషన్ల ప్రకటన రాజకీయ సందడి పెంచి, పార్టీల్లో లెక్కలు-వ్యూహాలు మార్చే పరిస్థితి తీసుకొచ్చింది.


