News March 8, 2025

Way2News Special.. వరంగల్‌ను శాసిస్తున్న మహిళా శక్తి

image

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం,నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలు, అధికారులతో మరో చరిత్ర సృష్టిస్తోంది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.

Similar News

News March 25, 2025

రైతులు సద్వినియోగం చేసుకోండి: సత్య శారద 

image

రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. నేటి నుంచి 27 వరకు మూడు రోజులపాటు నక్కలపల్లిలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2025

వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 24, 2025

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

error: Content is protected !!