News October 23, 2024

వయనాడ్: ప్రియాంకా గాంధీని ఢీకొంటున్న ‘యాక్సిడెంటల్ పొలిటీషియన్’

image

ప్రియాంకా గాంధీతో తలపడుతున్న BJP అభ్యర్థి నవ్యా హరిదాస్‌ది కోజికోడ్. వీరి కుటుంబానికి సంఘ్‌తో అనుబంధం ఉంది. 2009లో పెళ్లయ్యాక సింగపూర్‌కు వెళ్లిన నవ్య సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశారు. 2015లో కోజికోడ్ ట్రిప్‌కు వచ్చి లోకల్‌బాడీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఓడితే సింగపూర్ వెళ్దామనుకున్న ఆమె వరుసగా 2 సార్లు గెలిచి పార్టీలో ఎదిగారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి MLAగా ఓడినా BJP ఓట్ల శాతం17-21కి పెంచారు.

Similar News

News January 7, 2026

ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

image

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.

News January 7, 2026

వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

image

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News January 7, 2026

కోహ్లీ, సచిన్‌లకే సాధ్యం కాని రికార్డు.. పడిక్కల్ హిస్టరీ!

image

VHTలో కర్ణాటక ఓపెనర్ దేవదత్ <<18750203>>పడిక్కల్<<>> చరిత్ర సృష్టించారు. 3 వేర్వేరు సీజన్లలో 600పైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కారు. సచిన్, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలకూ ఇది సాధ్యం కాలేదు. రాజస్థాన్‌పై 91 రన్స్ వద్ద అవుటై 6 మ్యాచ్‌ల్లో ఐదో సెంచరీ చేసే ఛాన్స్ త్రుటిలో చేజార్చుకున్నారు. లిస్ట్-A క్రికెట్‌లో 83.62 Avgతో పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. VHTలో కర్ణాటక క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.