News August 2, 2024
వయనాడ్ విపత్తు: సైంటిస్టులు మాట్లాడొద్దన్న ‘కేరళ ఆర్డర్’ వెనక్కి

వయనాడ్ విపత్తుపై సైంటిస్టులు మాట్లాడకుండా, పరిశోధనలు చేయకుండా తీసుకొచ్చిన ఆర్డర్‌ను కేరళ సర్కారు వెనక్కి తీసుకుంది. విమర్శలకు తలొగ్గింది. ‘సైంటిఫిక్ కమ్యూనిటీ స్టడీస్ అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మీరు అభిప్రాయాలు చెప్పొద్దనే ఈ నిర్ణయం. ఈ సమస్యాత్మక సందర్భంలో మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రజలు భయపడొచ్చు’ అని ఆగస్టు 1న CS వేణు అన్నారు. కాగా ఈ విపత్తులో మానవ తప్పిదం ఉందని కొందరి వాదన.
Similar News
News March 3, 2026
సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.
News March 3, 2026
ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM

TG: అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3L మంది అనర్హులను తొలగించగలిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.
News March 3, 2026
ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీళ్లు!

AP: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల మంచి నీటిని అందించాలని అధికారులను CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ వీరిద్దరూ ఉండవల్లిలో 2 గంటలు <<19287163>>భేటీ అయ్యారు<<>>. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను CBNకు పవన్ తెలియజేశారు. స్థానిక ఎన్నికలు, TTD వివాదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై చర్చించినట్లు సమాచారం.


