News August 8, 2024
వయనాడ్ ప్రళయం.. ప్రజల్ని కాపాడిన చిలుక!

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని రక్షించింది. ప్రమాదానికి ముందురోజు వినోద్ అనే వ్యక్తి తన చిలుక (కింగిని)తో సోదరి ఇంటికి వచ్చారు. అయితే ఒక్కసారిగా అది బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విపత్తుపై హెచ్చరించింది. వెంటనే వినోద్ తేరుకొని పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. మూగజీవులకు విపత్తులను పసిగట్టే గుణం ఉంటుంది.
Similar News
News November 27, 2025
HYD: మీ చేతిరాత బాగుంటుందా?

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్‌పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.


