News July 31, 2024

వయనాడ్: పదేళ్ల క్రితమే హెచ్చరికలొచ్చాయి!

image

ఉత్తర కేరళ కొండచరియలు విరిగిపడేందుకు అత్యంత ఆస్కారం ఉన్న ప్రాంతమని పదేళ్ల క్రితమే నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఘటన జరిగిన మెప్పాడి పంచాయతీ సున్నితమైన ప్రాంతమని 2013లో 2 కమిటీలు నిర్ధారించాయి. అక్కడ నిర్మాణాలు, ఎటువంటి పరిశ్రమలు మొదలుపెట్టొద్దని సూచించాయి. తారియే, అచూరణం, పొళుతనా, కొట్టప్పాడి, చుండాలే, కున్నాతిదావక, వెల్లరిమాల సహా 13 గ్రామాలపై ప్రకృతి కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.

News November 24, 2025

భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

image

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.

News November 24, 2025

BREAKING: భారత్ ఆలౌట్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. 122కే 7 వికెట్లు కోల్పోయిన దశలో సుందర్, కుల్దీప్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 58, రాహుల్ 22, సాయి 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10, సుందర్ 48, కుల్దీప్ 19, బుమ్రా 5 రన్స్ చేశారు. IND 288 పరుగులు వెనుకబడింది. ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా RSA బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు.