News February 3, 2025
WCలో త్రిష.. జిల్లా పేరు నిలబెట్టారు: భద్రాద్రి కలెక్టర్

ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గొంగడి త్రిషకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మలేసియాలో జరిగిన అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం వాసి గొంగడి త్రిషకు జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ అభినందనలు చెప్పారు. జిల్లా పేరును ప్రపంచ వేదికలో నిలబెట్టి, ఈరోజు చివరి మ్యాచ్లో అద్భుతంగా రాణించినందుకు అభినందించారు.
Similar News
News January 18, 2026
ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.
News January 18, 2026
మేడారంలో కాసేపట్లో మంత్రివర్గ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక సమావేశం కోసం మంత్రులు ఇప్పటికే మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల చెంత జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై ప్రభుత్వం చర్చించనుంది. సాయంత్రం వేళ మంత్రులు వనదేవతలకు మొక్కులు చెల్లించి, భేటీలో పాల్గొననున్నారు.
News January 18, 2026
మేడారం చేరుకున్న సీఎం కుటుంబ సభ్యులు

CM రేవంత్ భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిషా, అల్లుడు, మనవడు రియాన్స్ ఆదివారం మేడారం చేరుకున్నారు. వనదేవతల చెంతకు చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు. సోమవారం ఉదయం CM కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఖమ్మం పర్యటన ముగించుకుని కాసేపట్లో మేడారం చేరుకోనున్న CM.. హరిత హోటల్‌లో బస చేస్తారు. అంతకుముందు అక్కడే జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు.


