News January 17, 2026
WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 20, 2026
వచ్చే నెల కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్?

మార్చి 9న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సెషన్‌లో కేంద్రం కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కంపెనీస్ యాక్ట్ (2013), LLP ACT (2008) చట్టాల్లోని రూల్స్‌ను ఈ బిల్లుతో సవరించనుంది. సాంకేతికంగా లేదా కార్యకలాపాల్లో జరిగే చిన్న పొరపాట్లపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తొలగించనుంది. డిజిటైజేషన్ ద్వారా పర్యవేక్షణ మెరుగవుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.
News February 20, 2026
పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం తగ్గిన బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,57,370కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,44,250 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 20, 2026
ALIMCO 41 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


