News April 1, 2025

400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం: భట్టి

image

TG: HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించింది. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి’ అని సూచించారు.

Similar News

News December 5, 2025

చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

image

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్‌గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.

News December 5, 2025

పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

News December 5, 2025

రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలం: నారాయణ

image

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్‌కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.